
మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటిదాకా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పెడతారనే అనుకున్నారు కాని సినిమాకు మహావీర అని టైటిల్ పెడుతున్నారట.
పరుచూరి బ్రదర్స్ మూల కథ రాయగా మిగతా కొందరు రచయితలు కూడా సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించగా హీరోయిన్స్ గా ఐశ్వర్య రాయ్, నయనతార నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టు 15న ముహుర్తం పెట్టనున్న ఈ సినిమా ఆగష్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.