
యువ హీరోల జోరు కొనసాగిస్తున్న ఈ తరుణంలో నితిన్ కూడా తన సినిమాలతో మంచి ఫలితాలనే అందుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అఆతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం లై సినిమతో రాబోతున్నాడు. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో వస్తుంది. మేగా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లై సినిమాను 7 కోట్లకు శాటిలైట్ కొన్నారట. స్టార్ సినిమాల రేంజ్ లో లై శాటిలైట్ అవడం అందరిని షాక్ ఇచ్చింది. టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా నితిన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గ్యారెంటీ అంటున్నారు చిత్రయూనిట్. ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నితిన్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. స్టైలిష్ లుక్ లో నితిన్ సర్ ప్రెజ్ ఇవ్వగా హను డైరక్షన్ టాలెంట్ తో లై ఆడియెన్స్ కు థ్రిల్ ఇస్తుందని అంటున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.