
టాలీవుడ్ లో డ్రుగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఉంది. పోలీసు వారు కొందరికి నోటీసులు పంపగా అసలు నోటీసులు అందని వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుండటం విశేషం. అయితే టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డ్రగ్స్ వాడుతాడని పోలీసుల లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉందని అంటున్నారు. అంతేకాదు పూరితో సన్నిహితంగా ఉండే వారందరికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలుస్తుంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం పూరితో సన్నిహితంగా ఉండే ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు స్టార్ హీరో రవితేజకు డ్రగ్స్ మరక అంటించేశారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కాని డ్రగ్స్ కేసులో పోలీసులు పైన తెలిపిన వారందరికి నోటీసులు పంపించారట. త్వరలోనే వీరు పోలీసుల విచారణలో పాల్గొంటారని తెలుస్తుంది. అయితే పూరి సినిమాలో పనిచేసిన వారంతా ఈ డ్రగ్స్ తో ముడిపడటం చూసి పూరినే తన దగ్గర పనిచేసిన వారికి ఇది అలవాటు చేస్తున్నాడని టాలీవుడ్ ఇన్నర్ టాక్. మరి బయటకు వచ్చిన ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అన్నది చూడాలి. అంతేకాదు దీని వల్ల వారి సిని కెరియర్ కు భంగం వాటిల్లే అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయంపై అన్ని ఆధారలుంటేనే వారి పేర్లు మెన్షన్ చేయడం మంచిదని తెలుస్తుంది.