
అదేంటి దువ్వాడ జగన్నాధం సక్సెస్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీగా ఉంటే బ్యాడ్ టైం ఎలా నడుస్తుందని ఆశ్చర్యపడొచ్చు. ఎప్పుడైతే పవర్ స్టార్ గురించి చెప్పను బ్రదర్ అని అన్నాడో అప్పటినుండి బన్నికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇక అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు బుక్ మై షో చేసిన ఓ చిన్న మిస్టేక్ వల్ల బన్ని మీద మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యేలా చేసింది.
ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే డిజె సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బన్నికి ప్రముఖ టికెట్ బుకింగ్ ఏజెన్సీ బుక్ మై షో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. డిజె ప్రమోషన్స్ లో అత్యుత్సాహం చూపిన బుక్ మై షో మెగాస్టార్ అల్లు అర్జున్ అని టైటిల్ బ్యాక్ టూ ఫాం అని పెట్టేసింది. ఇక ఆ టైటిల్ చూసిన దగ్గర నుండి మెగా ఫ్యాన్స్ మళ్లీ బన్నిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
అసలకే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కంటయిన బన్ని తాజాగా మెగా ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే బన్నికి నిజంగా బ్యాడ్ టైం నడుస్తుందనే అనిపిస్తుంది.