
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో మాత్రం వద్దంటాడు చెప్పండి. ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అంతా ఇంతా కాదు బాహుబలితో ఏకంగా తెలుగు జాతి గర్వపడేలా చేసిన దర్శకుడు ఆయన. బాహుబలి-2 అనుకున్న రేంజ్ సక్సెస్ కాదు కాదు అనుకున్న దాని కన్నా ఎక్కువ రేంజ్ సక్సెస్ అయ్యింది. ఇక కొద్దిపాటి విరామం తర్వాత జక్కన్న కూడా తన తర్వాత సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో రాజమౌళి తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు అన్న దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. హీరో డిసైడ్ అయిన తర్వాతే తండ్రి చేత కథ రాయించేస్తాడు జక్కన్న. ఇప్పటికే ఎన్.టి.ఆర్ తో కొందరంటుంటే కాదు మహేష్ తో అని కొందరంటున్నారు. అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో మాత్రం సినిమా తీయడం పక్కా అని మరోసారి బల్ల గుద్ది చెప్పాడు రాజమౌళి. అయితే అది ఇప్పుడే కుదురుతుందా అన్నది మాత్రం చెప్పలేదు. ఇక పవన్ తో కూడా సినిమా తీయాలని ప్రేక్షకులు కోరగా అది సాధ్యమవ్వకపోవచ్చని అన్నారు. సో మహేష్ రాజమౌళి కాంబినేషన్ ఫిక్స్ అయినట్టే. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.