ఇది తేజా సినిమానేనా..?

ప్రేమకథల స్పెషలిస్ట్ గా దర్శకుడిగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న తేజా ఈమధ్య కాలంలో చాలా వెనుకపడ్డాడని తెలిసిందే. ఒకప్పుడు తేజ సినిమా రిలీజ్ అంటే స్టార్ హీరోల సినిమాలు సైతం భయపడేలా ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం తేజ డైరక్షన్ లో రానా హీరోగా వస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి.


బాహుబలి తర్వాత రానా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను బీభత్సంగా పెంచేసింది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ట్రైలర్ కట్ కూడా చాలా కొత్తగా ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో సూపర్ అనిపించుకుంది. మరి తేజా తన లవ్ స్టోరీ మార్క్ దాటేసి చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా చూస్తుంటే తేజ ఈసారి గట్టి హిట్ కొట్టేస్తాడని అనిపిస్తుంది.