మహానటిలో కలక్షన్ కింగ్..!

మహానటి సావిత్రి బయోపిక్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న మహానటి సినిమాలో మరో గొప్ప నటుడు భాగమవుతున్నాడు. మహానటి జీవితానికి సంబందించిన అందరిని సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్న చిత్రయూనిట్ సావిత్రి భర్త జెమిని గణేష్ పాత్రలో మళయాల దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ఎన్.టి.ఆర్, ఏయన్నార్ గా నాగ చైతన్య నటిస్తారని తెలుస్తుంది.  

ఇక సావిత్రి నటించిన అన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసిన నట చక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రకు కలక్షన్ కింగ్ మోహన్ బాబుని సెలెక్ట్ చేశారట. ఈ పాత్రకు ముందు ప్రకాశ్ రాజ్ ను అనుకున్నారు కాని ఏవో కారణాల వల్ల ప్రకాశ్ రాజ్ ను తప్పించ మోహన్ బాబుని ఈ పాత్రకు ఫైనల్ చేశారని అంటున్నారు. ఇదే నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం.