హిట్ కోసం హాన్సిక తపన..!

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో స్టార్ డం తెచ్చుకున్న భామ హాన్సిక. పూరి చేత ఇంట్రడ్యూస్ చేయించబడ్డ హాన్సిక మోత్వాని తెలుగులో కన్నా ఎక్కువ తమిళ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక అక్కడ కెరియర్ కాస్త ప్రశ్నార్ధకంగా మారడం వల్ల మళ్లీ తెలుగు సినిమాల మీద కన్నేసింది. 


ప్రస్తుతం గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న గౌతం నంద మూవీలో నటిస్తుంది హాన్సిక. సినిమాలో ఇప్పటిదాకా ఆమె లుక్ రివీల్ చేయని చిత్రయూనిట్ ఆమె పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ పిక్ రిలీజ్ చేశారు. సినిమాలో స్పూర్తి పాత్రలో నటిస్తున్న హాన్సిక పాత్ర పేరుకి తగ్గట్టే ట్రెడిషన్ లుక్ లో కనిపిస్తుంది. మెయిన్ హీరోయిన్ కేథరిన్ అని ప్రచారం జరుగుతున్నా సినిమాలో హాన్సిక ఉన్నంతత్ సేపు చాలా ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు. మరి టాలీవుడ్ హాన్సికకు రీ ఎంట్రీ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.