
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. హీరోకి మాస్ ఇమేజ్ తీసుకురావడంలో బోయపాటి తర్వాతే అన్న నానుడి ఉంది. లాస్ట్ ఇయర్ బన్నితో సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
బోయపాటికి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందట. ఓవరాల్ గా పాతిక కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందట. నైజాం లో దిల్ రాజు ఈ సినిమాను 9 కోట్లకు కొనడం ఇంకా సంచలనంగా మారింది. ఇక సీడెడ్ లో 7, ఆంధ్రలో మరో 7 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల బిజినెస్ చేసింది బోయపాటి జయ జానకి నాయకా. సినిమా హీరో బెల్లంకొండ శ్రీను మరి మనోడి సినిమాకు పాతిక కోట్ల బిజినెస్ అంటే అది కచ్చితంగా బోయపాటి స్టామినా అని చెప్పేయొచ్చు. బిజినెస్ అయితే అయ్యింది కాని అది రాబట్టాలంటే సినిమాలో అదే రేంజ్ కంటెంట్ ఉండాల్సిందే. మరి బోయపాటి ఏం చేస్తాడో చూడాలి.