అనసూయ సర్జరీ.. అంతా ఉత్తిత్తేనట..!

హాట్ యాంకర్ అనసూయ సర్జరీకి సంబందించిన హాట్ న్యూస్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా అదరగొట్టేస్తున్న అనసూయ తన అందాలతో మరింత మెస్మరైజ్ చేసేందుకు నడుము దగ్గర సర్జరీ చేయించుకుందని హాట్ న్యూస్. హాట్ ఫిగర్ తో హీటు పుట్టించేస్తున్న అనసూయ తన నడుము భాగం దగ్గరే అంత సాటిస్ఫైడ్ గా లేదట.

అందుకే సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుందట. అయితే తనపై వస్తున్న ఈ వార్తలను ఖండించేసింది అనసూయ. తనకు షార్ట్ కట్స్ నచ్చవని ప్రస్తుతం తనకు అంత అవసరం కూడా లేదని అంటుంది అనసూయ. ఇక తనపై ఇలాంటి రూమర్స్ రావడం కామనే అని ఈ సర్జరీ న్యూస్ పై చాలా లైట్ తీసుకుంటుంది అమ్మడు. ప్రస్తుతం సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనసూయ.