47 ఏళ్ల భామకు పెళ్లి మీద మనసు మళ్లింది..!

తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి శోభన ఇన్నాళ్లకు పెళ్లిచేసుకోబోతుంది. నాట్యకారిణిగా సత్తా చాటిన శోభన సొంతంగా ఓ కళాశాలను నడిపిస్తుంది. ఇన్నాళ్లు పెళ్లి ద్యాస లేని ఈ ముదురు భామ ఇప్పటికి పెళ్లి మీద గాలి మళ్లింది. ఈ క్రమంలో ఓ బిజినెస్ మ్యాన్ తో పెళ్లికి సిద్ధమైందట.  

ఒకప్పటి లీడింగ్ హీరోయిన్ సౌత్ సిని ప్రేక్షకులను అలరించిన శోభన హీరోయిన్ గానే కెరియర్ కు గుడ్ బై చెప్పేసింది. తను నటించిన ప్రతి పాత్రలో తనకు వచ్చిన నాట్య ప్రదర్శనతో కూడా ఆకట్టుకుంది శోభన. ఐదేళ్ల క్రితం ఓ బిడ్డను దత్తత తీసుకున్న శోభన ఇన్నేళ్లు పెళ్లి మీద ఆలోచన చేయలేదు. మరి ఇంత సడెన్ గా శోభన పెళ్లి మీద మనసు ఎందుకు మళ్లిందో కాని ఇంత లేటు వయసులో శోభన పెళ్లి వార్త ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.