జబర్దస్త్ రశ్మికి వైజాగ్ తో లింక్ ఏంటి..!

యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తూనే గుంటూర్ టాకీస్ లాంటి సినిమాల్లో గ్లామర్ షోతో హాట్ ఇమేజ్ సంపాదించిన జబర్దస్త్ రష్మి క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. అనసూయని తప్పించినా జబర్దస్త్ ను జబర్దస్తీగా తన టాలెంట్ తో నడిపించేసింది అమ్మడు. యాంకర్ గానే కాదు హాట్ హీరోయిన్ గా కూడా రష్మికి ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ వచ్చింది. అందుకే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు రష్మి.   

రీసెంట్ గా వైజాగ్ లో ఓ స్వీట్ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన రష్మి అక్కడ మీడియాతో మాట్లాడింది. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పొచ్చిన రష్మి ఫ్యూచర్ లో తాను వైజాగ్ లోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇక రష్మి అలా మాట్లాడేసరికి వైజాగ్ కుర్రాడితో రష్మి లవ్ లో పడ్డదా అంటూ వార్తలు రాయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆది హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న రష్మి ఇకనుండి వరుసగా సినిమాలు చేస్తా అని అన్నది.