కలర్ స్వాతి ఆశలన్ని దాని మీదే

మాటివిలో కలర్స్ ప్రోగ్రాంతో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలిచిన కలర్ స్వాతి ఆ ఇమేజ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అష్టా చమ్మతో నాని సరసన నటించిన ఈ చిన్నది కెరియర్ కాస్త అటు ఇటుగానే నడిపిస్తుంది. లాస్ట్ వచ్చిన త్రిపుర మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కూడా నిరాశ పరచింది. ఇక ప్రస్తుతం స్వాతి నటిస్తున్న సినిమా లండన్ బాబులు. 

మారుతి డైరక్షన్ లో నిక్షిత్ హీరోగా వస్తున్న ఈ సినిమా అదవన్ కట్టలై అనే తమిళ సినిమాకు రీమేక్ గా వస్తుందని తెలుస్తుంది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ సమయంలో హీరోయిన్ గా ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవాలంటే అదనపు ఆకర్షణలు కావాల్సిందే. అందుకే స్వాతి కూడా ఇన్నాళ్లు గ్లామర్ షోకి కాస్త దూరంగా ఉండగా ఇప్పుడు ఆ అడ్డుగోడలను తీసేది తాను స్కిన్ షోకి సిద్ధమే అని అంటుందట. లండన్ బాబులు సినిమాలో అమ్మడు కొత్తగా కనిపించబోతుందని టాక్. మరి స్వాతి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ లండన్ బాబులు ఆమె హిట్ కల నెరవేరుస్తుందో లేదో చూడాలి.