సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య..!

యువ హీరో సందీప్ కిషన్ హీరోగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు కాని సక్సెస్ రేటు మాత్రం అసలు పెరగట్లేదు. ఇంతవరకు మనవాడి ఖాతాలో ఓ సూపర్ హిట్ లేదంటే నమ్మాలి. ప్రస్తుతం సెట్స్ మీద చాలా సినిమాలు ఉన్నా సరే అతని ఎకౌంట్ లో కొత్త సినిమాలు ఓపెన్ చేస్తూనే ఉన్నాడు సందీప్ కిషన్. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల డైరక్షన్ లో మూవీ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.  


తెలుగు తమిళ భాషల్లో నా పేరు శివ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుశీంతిరన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. సినిమా టైటిల్ గా కేరాఫ్ సూర్య అని పెట్టారు అంతేకాదు ఈ టైటిల్ లోగో కోలీవుడ్ సూపర్ హీరో సూర్యతో రిలీజ్ చేయించడం విశేషం. కెరియర్ లో మొదటిసారి తెలుగు తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సుశీంతిరన్ సందీప్ కిషన్ కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

నా పేరు శివ మధ్యతరగతి కుటుంబంలో సాగిన కథ.. ఇప్పుడు కేరాఫ్ సూర్య కూడా అలానే రియలిస్టిక్ కథాంశంతో రాబోతుందట. కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహెరిన్ కౌర్ పిర్జాదా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.