నా బాడీ నా ఇష్టం.. మీకేంటి ప్రాబ్లెం..!

కోలీవుడ్ భామ శృతి హాసన్ కు ముక్కు మీద కోపం ఉంటుందన్న సంగతి తెలిసిందే. తరచు వివాదాల్లో ఉండే అమ్మడు ఇప్పుడు తన మీద సెటైర్లు వేస్తున్న నెటిజెన్ల మీద ఫైర్ అవుతుంది. ఈమధ్య శృతి హాసన్ పెదాలకు ఆపరేషన్ చేయించుకుందని టాక్.. వాటిని ప్రూవ్ చేస్తూ శృతి ఇదవరకు ఫోటో ప్రస్తుత ఫోటో పెట్టి పోల్చి మరి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇక ఈ విషయం గమనించిన శృతి హాసన్ తన శరీరంపై సర్వ హక్కులు తనవే అని తన బాడీని ఎలాగైనా చేసే అధికారం తనకుందని అంటుంది శృతి హాసన్.

చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక విషయంలో చిత్రయూనిట్ లో గొడవ పడుతున్న శృతి ఈమధ్య తనలోని మార్పులతో అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. అప్పట్లో బోయ్ ఫ్రెండ్ తో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అదేంటి అంటే ఇది నా లైఫ్ నా ఇష్టం అన్నది. ఇప్పుడేమో తన లిప్స్ పై వచ్చిన కామెంట్స్ తో నా బాడీ నా ఇష్టం అంటుంది.