
ప్రేమకథల స్పెషలిస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమతో హిట్ అందుకున్న దర్శకుడు కరుణాకరన్ తన మార్క్ సినిమాలను తీస్తూ వస్తున్నాడు. అయితే ఈమధ్య సక్సెస్ ట్రాక్ లో లేని కరుణాకరన్ ఈసారి తన సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ సీక్వల్ గా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న కరుణాకరన్ ఆ కథను మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కు వినిపించాడట.
తొలిప్రేమ సీక్వల్ లో మెగా మేనళ్లుడు తేజ్ అయితే బాగుంటుందని కరుణాకరన్ భావించి అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ రాసుకున్నాడట. ప్రస్తుతం జవాన్ షూటింగ్ లో ఉన్న తేజ్ అది పూర్తి చేశాక వినాయక్ తో సినిమా చేసే అవకాశాలున్నాయట. ఒకవేళ కరుణాకరన్ తో సినిమా ఫైనల్ అయితే తొలిప్రేమ షురూ చేస్తారని అంటున్నారు. ఈ న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కే కాదు మెగా ఫ్యాన్స్ కు కూడా మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి తొలిప్రేమ సీక్వల్ లో మెగా మేనళ్ళుడు ఎలా ఉంటాడో చూడాలి.