చరణ్ సినిమాకు వడబెబ్బ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఎండ తీవ్రత పెరగడంతో సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాజమండ్రి పరిసర పాంత్రాల్లో మొదటి షెడ్యూల్ జరుపుకున్న చిత్రయూనిట్ అక్కడ కూడా ఎండ దెబ్బ తగలడం వల్లనే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో కొద్దిరోజుల పాటు మళ్లీ షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి మెగాస్టార్ 151వ సినిమా నిర్మాణ భాధ్యతలను చూడాలనుకుంటున్న చెర్రికి సీన్ అంతా రివర్స్ అవుతుంది.