క్రేజీ సీక్వల్ ఛాన్స్ కొట్టేసిన దేవి..!

ట్రెండీ మ్యూజిక్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ రాక్ స్టార్ గా అవతైంచిన దేవి శ్రీ ప్రసాద్ కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. స్టార్ హీరోలకే కాదు కుర్ర హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్న దేవి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు పనిచేస్తుండటం విశేషం. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ హరి డైరక్షన్ లో చియాన్ విక్రం హీరోగా సామి సీక్వల్ సినిమా స్టార్ట్ అవనుంది. 

ఈ సినిమాకు ముందు మ్యూజిక్ కోసం హారీస్ జైరాజ్ ను అనుకున్నారట. ఏమైందో ఏమో కాని ఆ ప్రాజెక్ట్ నుండి హారీస్ ను తప్పిస్తూ దేవి ని సెలెక్ట్ చేసినట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈమధ్యనే హరి తీసిన సింగం-3 మూవీకి హారీస్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా ఫ్లాప్ లో మ్యూజిక్ కూడా ఓ కారణమని కామెంట్స్ రావడంతో తను తీయబోయే సామి సీక్వల్ లో దేవిని తీసుకున్నాడట. సినిమాలో హీరోయిన్స్ గా త్రిష, కీర్తి సురేష్ నటిస్తున్నారు.