ధనుష్ హాలీవుడ్ మూవీ..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కేవలం తమిళ ప్రరిశ్రమకే అంకితం కాకుండా ఇటు తెలుగుతో పాటుగా హిందిలో కూడా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా మాత్రమే కాదు దర్శకత్వంలో కూడా తన సత్తా చాటిన ధనుష్ నిర్మాతగా కూడా సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ ఓ హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు.


మర్జానే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. రోమైన్ ప్యూర్టోలాస్ రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందడం విశేషం. ధనుష్ లాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ తో పనిచేయడం ఆనందంగా ఉందన్న మర్జానే ఒక నటుడు దర్శకత్వం మీద పట్టుసాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ సినిమా టైటిల్ గా 'ది ఎక్స్ ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' అని పెట్టారట.. ఈ సినిమాతో ధనుష్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.