
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాధ్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈమధ్యనే కె.ఎస్.రవికుమార్ మీద తన 102వ సినిమా ఫిక్స్ చేశాడు బాలకృష్ణ. ఆ సినిమా టైటిల్ గా రెడ్డిగారు అని పెట్టబోతున్నారట. పూరి సినిమాలో డాన్ గా నటిస్తున్న బాలయ్య రవికుమార్ సినిమాలో రెడ్డి గారుగా కనిపించనున్నారు.
శాతకర్ణి సక్సెస్ తర్వాత మరింత జోష్ పెంచుకున్న బాలయ్య ఫుల్ స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నాడు. పూరితో సినిమా పూర్తి కాకముందే రవికుమార్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఇదే స్పీడ్ రాబోయే సినిమాలకు కంటిన్యూ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక రెడ్డి గారులో స్టార్ట్ కాస్ట్ ఎవరు అన్నది త్వరలో తెలుస్తుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారని తెలుస్తుంది.