మ్యూజిక్ బిట్ తో డిజె సందడి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డిజె దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ బిట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. దేవి మార్క్ మాస్ బీట్ కు బన్ని మార్క్ మాస్ స్టెప్ అది కూడా లుంగి డ్యాన్స్ తో అదరగొట్టేశారు. మ్యూజిక్ బిట్ ఉంది 22 సెకన్లే అయినా ఫ్యాన్స్ ను మాత్రం ఫుల్ ఖుషి చేసింది.


త్వరలో ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అవబోతుందని తెలిసిందే. ఇప్పటికే టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేసిన డిజె ఈ మ్యూజిక్ బిట్ తో సిని ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. లాస్ట్ ఇయర్ సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్ని డిజెను అంతకుమించి సూపర్ హిట్ సినిమాగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.