
సోషల్ విప్లవం అదేనండి సోషల్ మీడియా ఒకటి వచ్చాక ఎవరికి ఏదనిపిస్తే అది ఎలాంటి నిర్మొహమాటం లేకుండా బయట పెట్టేస్తున్నారు. వీటిలో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఉన్నా గొడవకు దారి తీస్తున్నా సరే మా అభిప్రాయం ఇదే అంటూ చెబుతున్నారు. ఇంతకీ ఈ లీడ్ ఎందుకు అంటే బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో బ్యాడ్ రివ్యూ ఇచ్చి ఆ సినిమా స్టార్ట్ కాస్ట్, దర్శకుడు రాజమౌళిని చీల్చి చెండాడిన బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ ఇప్పుడు తను చేసిన తప్పుకి లెంపలేసుకుంటున్నాడు.
ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి కన్ క్లూజన్ ఇంకా సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతానికి 1330 కోట్ల కలక్షన్స్ తో దూసుకెళ్తున్న బాహుబలి గురించి తన రివ్యూ తప్పని ఒప్పుకున్నాడు కమల్. అంతేకాదు సినిమా నాకు నచ్చలేదు జనాలకు నచ్చింది.. జనం మాట దేవుడి మాట అని నమ్ముతా కాబట్టి సారీ రాజమౌళి అని ట్వీట్ చేశాడు కమల్ ఆర్ ఖాన్. ఇతగాడి ట్వీట్స్ ఎవరు పట్టించుకోకపోయినా బాహుబలి పై ఇతనిచ్చిన నెగటివ్ రివ్యూపై ఫ్యాన్స్ అతని మీద ట్విట్టర్ లో యుద్ధానికి దిగారు అందుకే అతను కూడా దిగిరాక తప్పలేదు.