డాన్ గా రజిని.. కాని..!

సూపర్ స్టార్ రజినికాంత్ కు ముంబై మాజి మాఫియా డాన్ హజి మస్తాన్ దత్తపుత్రుడు నోటిసులు పంపించిన సంగతి తెలిసిందే. తను చేస్తున్న రంజిత్ డైరక్షన్ లో మూవీ తండ్రి మీదే తీస్తున్నారనే విషయంపై ఈ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మ్యాటర్ పై రజిని టీం క్లారిటీ ఇచ్చింది.. రజినికాంత్ చేసేది మాఫియా డాన్ సినిమానే అయినా అనుకున్నట్టుగా మస్తాన్ జీవితం గురించి కాదని వివరణ ఇచ్చారు.

ఇప్పటికే రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమా చేసిన రజినికాంత్ ఈసారి కబాలి కన్నా మించిన సినిమాతో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు మరో సర్ ప్రైజ్ ఏంటి అంటే సినిమా నిర్మించేది నటుడు నిర్మాత రజిని అల్లుడు ధనుష్ అవడం విశేషం. ఈ నెల 26నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా సూపర్ స్టార్ రజిని స్టామినా ఏంటో ప్రూవ్ చేసేలా ఉంటుందని తెలుస్తుంది.