మరో హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన ప్రియాంకా..!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంకా చోప్రా అక్కడ సూపర్ క్లిక్ అయినట్టు కనిపిస్తుంది. క్వాంటికో సీరీస్ లో ఛాన్స్ సంపాదించిన అమ్మడు బేవాచ్ సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ అవకముందే హాలీవుడ్ లో మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది ప్రియాంకా చోప్రా. ఈ విషయం ప్రియాంకా నిర్మాత వెళ్లడించడం విశేషం.

జిమ్, క్లారి, అక్టేవియా స్పెన్సర్, ప్రియాంకా చోప్రా, మైకెల్ వాట్ తో కలిసి తాను ఓ సినిమా నిర్మిస్తున్నానని ఎనౌన్స్ చేశాడు పాల్ బెర్నాన్. సీరియల్ సీరీస్ లో రెచ్చిపోయిన అమ్మడు సినిమాలో కూడా అదరగొట్టిందని టాక్. బేవాచ్ ఈ నెల 25న రిలీజ అవుతుండగా ఆ సినిమా ప్రీమియర్ షో చూశాక ప్రియాంకా నటనకు అందరు ఫిదా అయ్యారట. సో మొత్తానికి ఇండియన్ యాక్ట్రెస్ హాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నందుకు కచ్చితంగా సంతోషించాల్సిందే.