
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత పవన్ ఏ సినిమా చేస్తాడు అన్న దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. లేటెస్ట్ గా బాలీవుడ్ రీమేక్ పై పవన్ మనసు పడ్డాడని ఫిల్మ్ నగర్ టాక్. అక్షయ్ కుమార్ నటించిన జాలి ఎల్లెల్బి-2 సినిమా తెలుగులో పవర్ స్టార్ రీమేక్ చేయాలని చూస్తున్నాడట.
ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక అండ్ హాసిని రాధాకృష్ణ సొంతం చేసుకున్నారట. తెలుగులో పవన్ హీరోగా ఈ సినిమా చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఆ రీమేక్ కు డైలాగ్స్ త్రివిక్రం ఇస్తున్నాడట. దర్శకుడు ఎవరో తెలియదు కాని జాలి ఎల్లెల్బి-2 రీమేక్ లో పవన్ నటించడం మాత్రం పక్కా అని అంటున్నారు. మరి దీని గురించి అఫిషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.