
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూ 23న రిలీజ్ ఫిక్స్ చేశారు. వరుస హిట్స్ కొడుతున్న బన్ని లాస్ట్ ఇయర్ సరైనోడుతో కెరియర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను క్రాస్ చేసేలా డిజె సిద్ధమవుతుందట.
కొద్దిరోజుల క్రితం వదిలిన డిజె టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారట. బన్ని సినిమాల్లో దేవి మ్యూజిక్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇద్దరిది సూపర్ హిట్ మ్యూజిక్ కాంబినేషన్ కూడా. అందుకే ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోయేలా ఉంటాయని అంచనావేస్తున్నారు.