నాని నిన్ను కోరి సూపర్ బిజినెస్..!

నాచురల్ స్టార్ నాని రేంజ్ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటిదాకా 3 కోట్ల బిజినెస్ తో స్టార్ట్ అయ్యే నాని ఇప్పుడు ఏకంగా 20 కోట్లకు చేరుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని వరుస హిట్లు అందుకుంటున్నాడు ఇక రీసెంట్ గా వచ్చిన నేను లోకల్ నాని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ క్రమంలో తను ప్రస్తుతం నటిస్తున్న నిన్ను కోరి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందట.

శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న నిన్ను కోరి సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ కు ముందే 20 కోట్లకు పైగా బిజినెస్ చేసిందట. చిన్న హీరోగా మొదలైన నాని ప్రస్థానం ఈ రేంజ్ కు ఎదగడం గొప్ప విషయమని చెప్పొచ్చు. జూన్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నాని హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.