
ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి కన్ క్లూజన్ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఊహించిన దాని కన్నా బాహుబలి కలక్షన్స్ వీర విహారం చేస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు యూఎస్ లో ఇండియన్ సినిమా సత్తా అది కలెక్ట్ చేయగల స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. కేవలం పది రోజుల కలక్షన్స్ తోనే 1000 కోట్ల మార్క్ దాటుకున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్లు సాధ్యమే అన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇక ప్రత్యేకంగా యూఎస్ బాక్సాఫీస్ మీద బాహుబలి దండయాత్ర కొనసాగుతుంది. హాలీవుడ్ సినిమాలను పక్కన నెట్టేసి మరి బాహుబలి కలక్షన్స్ హవా కొనసాగుతుంది. ఒక్క యూఎస్ బాక్సాఫీస్ నుండే బాహుబలికి 106 కోట్ల కలక్షన్స్ రాబట్టడం అద్భుతమైన విషయం. ఓ తెలుగు సినిమా కాదు.. ఓ ఇండియన్ సినిమా యూఎస్ లో ఈ రేంజ్ వసూళ్ల వరద సాధించడం అది కేవలం బాహుబలి వల్లే జరిగిందని చెప్పొచ్చు.
పోటీగా రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమాలన్నిటినే కాకుండా ఇంతకుముందు ఉన్న సినిమా రికార్డులను సైతం అధిగమించి బాహుబలి సత్తా చాటుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ మూవీస్ అయిన ద బాస్ బేబి, ది సర్కిల్ లాంటి సినిమాలను మించి కలక్షన్స్ రాబట్టింది బాహుబలి కం క్లూజన్. ఇండియన్ సినిమా ఈ రేంజ్ బాక్సులు బద్ధలు కొట్టే రికార్డ్ సాధించడం ఇదే మొదటిసారి. వారాంతరంలోనే 10.3 మిలియన్ డాలర్స్ సంపాదించిన 3వ సినిమాగా బాహుబలి యూఎస్ లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ప్రస్తుతం 1000 కోట్లు దాటిన బాహుబలి కలక్షన్స్ చూస్తుంటే 1500 కోట్లు దాటడం ఖాయమని చెప్పొచ్చు. హాలీవుడ్ సినిమాలను సైతం షేక్ ఆడిస్తున్న బాహుబలి సినిమా తీసిన దర్శకుడు రాజమౌళికి సాహో అని చెబుతూ ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులను కొల్లగొట్టాలని ఆశిద్దాం.