
బాహుబలి భళ్లాలదేవగా సూపర్ క్రేజ్ సంపాదించిన రానా ఎలాంటి పాత్రలో అయినా సరే తను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. అందుకే క్రేజీ పాత్రలను ముందు రానా దగ్గరకు తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో మెగాస్టార్ 151వ సినిమాగా రాబోతున్న ఉయ్యాలవాడ నర సింహారెడ్డి సినిమాలో రానాకు ఓ స్పెషల్ రోల్ ఇస్తున్నారట.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న ఈ సినిమాలో రానా రోల్ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇప్పటికే రానాకు తనా రోల్ గురించి దర్శక నిర్మాతలు చర్చలు జరిపారట. సో మొత్తానికి బాహుబలి తర్వాత రానా మరోసారి పిరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడన్నమాట. మరి ఈ సినిమాలో రానా ఎలా అలరిస్తాడో చూడాలి.