
స్టార్ క్రేజ్ ఉన్న తమన్నా ఓ కుర్ర హీరో సినిమాలో నటించడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మ్యూజిక్ డైరక్టర్ నుండి హీరోగా కొత్త టర్న్ తీసుకున్నాడు జివి ప్రకాశ్. యూత్ ఫుల్ మూవీస్ తో అలరిస్తున్న జివి ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన సుకుమార్ తమిళంలో నిర్మిస్తున్నాడు.
చంద్రమౌళి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ లో తమన్నానే హీరోయిన్ గా పెట్టుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఆల్రెడీ తను నటించిన సినిమానే కాబట్టి చేయనని చెప్పకపోవచ్చు కాని అమ్మడు జివి ప్రకాశ్ పక్కన చేస్తుందా అన్న డౌట్ వస్తుంది. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమా హీరోయిన్ విషయం త్వరలో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది.