బాహుబలి సినిమా అనుకున్నట్టుగానే 1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే అంచనాలను మించి ఈ సినిమా వసూళ్లు సాధించడం స్టార్స్ ను సైతం అవక్కయ్యేలా చేస్తుంది. ఇక బాహుబలి సాధించిన వెయ్యి కోట్ల కలక్షన్స్ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాజమౌళి అండ్ కో ప్రభాస్ అందరికి అభినందనలు తెపులుపుతూ ట్వీట్ చేశాడని తెలిసిందే.
ఇక ఇప్పుడు అదే దారిలో సూపర్ స్టార్ మహేష్ కూడా బాహుబలి వెయ్యి కోట్ల కలక్షన్స్ పై తనదైన రీతిలొ స్పందించారు. ఊహించనిది జరిగిందని.. తనతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు మహేష్. ప్రభాస్ నటన, రాజమౌళి దర్శకత్వం రెండు కలిసి బాహుబలిని ఈ స్థాయిలో నిలబెట్టాయి.