1000 కోట్ల క్లబ్ లో బాహుబలి..!

అనుకున్నట్టుగానే బాహుబలి ది కన్ క్లూజన్ 1000 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా రెండు వారాలకే ఈ రేర్ ఫీట్ సాధించడం విశేషం. ఇప్పటిదాకా ఉన్న ఇండియన్ సినిమా రికార్డులన్నిటిని చెరిపేస్తూ బాహుబలి ది కన్ క్లూజన్ 1000 కోట్ల కలక్షన్స్ సాధించింది. ఇప్పటిదాకా ఉన్న పికె 800 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రికార్డును సైతం బ్రేక్ చేసింది బాహుబలి-2.

విడుదలకు ముందే ఈ సినిమా వెయ్యి కోట్ల కలక్షన్స్ సాధిస్తుందని ఊహించినా కేవలం రెండు వారాల్లోనే బాహుబలి ఈ రేంజ్ ప్రభంజనాలు సృష్టించడం విశేషం. ఇండియా మొత్తం 800 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేయగా ఓవర్సీస్ లో బాహుబలి 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఫుల్ రన్ లో సినిమా 1500 కోట్లు వసూళు చేస్తుందని అంటున్నారు. మొత్తానికి దేశం గర్వించేలా భారీ కలక్షన్స్ సాధించే సినిమా తెలుగు పరిశ్రమ నుండి రావడం సిని ప్రియులను ఉత్సాహపరుస్తుంది.