ఆ కారణం చేతే తమన్నా సీన్స్ కట్..!

బాహుబలి-2 చూసిన ప్రతి ఒక్కరు ఆనందించినా తమన్నా ఫ్యాన్స్ మాత్రం కాస్త అప్సెట్ అవ్వక తప్పదు. అమ్మడేమో పార్ట్ 2 లో కూడా తన పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పగా తీరా సినిమా చూస్తే అందులో కనీసం డైలాగ్ కూడా లేకుండా చేశాడు రాజమౌళి. దీనికి సమాధానం చెప్పుకోలేక తమన్నా తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే అసలు తమన్నా సీన్స్ ఉండేలా లానే ప్లాన్ చేశాడట జక్కన్న.

రానా ప్రభాస్ యుద్ధానికి మధ్యలో అవంతికతో కొన్ని గ్రాఫికల్ ఫైట్ సెట్ చేశారట. అయితే ఫైనల్ అవుట్ పుట్ చూశాక రాజమౌళి సాటిస్ఫై కాలేదట.. క్వాలిటీ బాగాలేకపోవడంతో తమన్నా సీన్స్ కట్ చేశారని తెలుస్తుంది. ఈ విషయంపై ముందే తమన్నాకి వివరించారట కూడా అందుకే ప్రస్తుతం బాహుబలి సాధించిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ తన పాత్ర గురించి మర్చిపోయి ఉంటుంది తమన్నా.