
ఏ విషయం మీద అయినా కొంతమంది అభిప్రాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.. ప్రస్తుతం బాహుబలి-2 సినిమాకు వస్తున్న ప్రశంసల జడివాన గురించి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తనదైన విధంగా స్పందించాడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు. బావా బాహుబలి అంటూ ప్రభాస్ ను సంభోదిస్తూ.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు.. ఇప్పుడు దేశాన్ని రాజులు పరిపాలిస్తున్నారు.. దాన్ని ప్రభాస్ రాజు నిరూపించాడని అన్నారు.
అంతేకాదు నీ తండ్రి ఎక్కడున్నా తన ఆశీస్సులు నీకుంటాయని.. ఈ విజయం మీ అమ్మకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. బావా బాహుబలి ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకో అంతా మంచే జరుగుతుంది అని ట్వీట్ చేశాడు మోహన్ బాబు. ఇక్కడ ప్రభాస్ ను బావా అని ఎందుకు పిలిచాడంటే ఇద్దరు కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ త్రిష అన్నగా మోహన్ బాబు నటించారు. అందుకే ఆ సినిమాతో ఏర్పడ్డ పరిచయంతో బావా బాహుబలి అంటూ ప్రభాస్ నిజంగా రాజే అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.