
బాహుబలి సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాగా కాకుండా అక్కడ ఖాన్ సినిమాల కలక్షన్స్ ను కూడా కుదిపేస్తూ 200 కోట్ల షేర్ వసూలు చేసిన బాహుబలి ఓవర్సీస్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. ఇక మరో పక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో బాహుబలి అలవోకగా 100 కోట్ల కలక్షన్స్ సాధించింది. ఏపి, తెలంగాణాలో 650 థియేటర్లలో రిలీజ్ అయిన బాహుబలి ఇప్పటివరకు 100.05 కోట్ల కలక్షన్స్ సాధించింది.
ఇక ఏరియాల వారిగా కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి.
నైజాం : 28.15 కోట్లు
సీడెడ్ : 17.45 కోట్లు
ఉత్తరాంద్ర : 12.85 కోట్లు
ఈస్ట్ గోదావరి : 10.84 కోట్లు
వెస్ట్ గోదావరి : 8.67 కోట్లు
కృష్ణా : 7.23 కోట్లు
గుంటూరు : 10.83 కోట్లు
నెల్లూరు : 4.03 కోట్లు
మొత్తం 100.05 కోట్ల కలక్షన్స్ తో బాహుబలి-2 దూసుకెళ్తుంది. ఈ వారం కూడా చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ ఉన్నాయి కాబట్టి మేజర్ థియేటర్స్ లో ఈ సినిమానే ఆడుతుంది. కచ్చితంగా తెలుగులో మరో సంచలన విజయం అందుకునే దిశగా బాహుబలి-2 ప్రభంజనాలు సృష్టిస్తుంది.