
యాంకరింగ్ లో తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్న లాస్య. పెళ్లికి ముందు దాకా తన స్క్రీన్ షేర్ చేసుకున్న రవితో వచ్చిన వార్తలకు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది. రవితో ఏకంగా లాస్య పెళ్లి కూడా జరిగింది అన్న వార్తలను తన సహనంతో భరించింది. తను ఎన్నాళ్ల నుండో ప్రేమించిన మంజునాధ్ ను ప్రేమించి పెళ్లాడింది లాస్య.
ఇక పెళ్లి తర్వాత అయినా సరే ఆమెను వదలట్లేదు మీడియా. తాజాగా లాస్య మీద ఓ కొత్త రూమర్ హల్ చల్ చేస్తుంది. లాస్య ప్రస్తుతం గర్భవతి అని.. త్వరలోనే తల్లి కాబోతుందని ఈ వార్తల సారాంశం. ఈమధ్యనే పెళ్లి చేసుకున్న తను అప్పుడే తల్లిని ఎలా అవుతానంటూ మీడియా తన మీద చూపిస్తున్న అతికి ఫైర్ అవుతుంది లాస్య. తన విషయాలేమైనా ఉంటే తానే ఎనౌన్స్ చేస్తానని చెప్పిన లాస్య కెరియర్ ను పక్కన పెట్టేసి భర్తతో జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.