మహేష్ పక్కన మళ్లీ ఛాన్స్ మిస్..!

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కాని బాలీవుడ్ ఓ హీరోయిన్ మాత్రం అలాంటివ్ అవకాశం రెండు సార్లు వచ్చినా చేజేతులా కాదనుకుంది. ఇంతకీ మహేష్ నే కాదన్న హీరోయిన్ ఎవరు అంటే బీ టౌన్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా అని అంటున్నారు. బాలీవుడ్ లో ఏ కొద్ది ఇమేజ్ ఉన్నా సరే సౌత్ సినిమా ఆఫర్ రాగానే చుక్కల్లో పారితోషికం చెప్పేస్తారు తారామణులు.

అందుకే ప్రతి స్టార్ హీరో సినిమాకు బాలీవుడ్ హీరోయిన్స్ ను అడగటం.. వారు భారీగా డిమాండ్ చేయడంతో ఉన్న వారితో అడ్జెస్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నారట. కాని అమ్మడు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగిందట. అందుకే ఆమెను పక్కన పెట్టి ఎం.ఎస్.ధోని హీరోయిన్ బికిని బేబ్ కియరా అద్వానిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే కాదు శ్రీమంతుడు. స్పైడర్ సినిమాల విషయంలో కూడా బీ టౌన్ హీరోయిన్స్ భారీ డిమాండ్ చేయడంతోనే ఇక్కడ వారితోనే చేశాడు మహేష్.