పవన్ అలా చేస్తే బెటర్..!

ఇంటర్వ్యూ ఏదైనా సరే అది సెన్సేషనల్ అవ్వాలంటే స్టార్స్ మీద కామెంట్స్ చేసేయాలి. కొంతమంది కావాలని అలా చేస్తే కొందరు మాత్రం తప్పక వారి ప్రస్థావన తెస్తారు. ఈ క్రమంలో బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ పవన్ గురించి ఏమన్నాడు అంటే పవన్ తన సినిమాలకు తనే కథ రాసుకుంటేనే బెటర్ అన్నాడట.

బాహుబలి, భజరంగి భాయ్ జాన్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ బాహుబలి-2 ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ గురించి ప్రస్థావించాడు. అయితే ఈ రచయిత పవన్ ను ఏ దృష్టిలో అలా అన్నాడో కాని పవన్ తనంతట తాను రాసుకుని తీసిన జాని, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరి వెటకారంతో అన్నాడా లేదంటే నిజంగా ఈసారి పవన్ తన ఆలోచనల్లోంచి కథ రాసుకుంటే బెటర్ అన్నాడో కాని పవర్ స్టార్ పై విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ పవర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి.