బన్ని చేతిలో మోసపోయిన మిస్టర్ వరుణ్..!

శ్రీనువైట్ల వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్టర్. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఆగడు, బ్రూస్ లీ ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్ల మరో ఫ్లాప్ అందుకున్నాడని అంటున్నారు. వరుణ్ తేజ్ నమ్మకాన్ని వమ్ముచేశాడని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే శ్రీనువైట్ల మిస్టర్ కథ ముందు అల్లు అర్జున్ కు వినిపించాడట.

తన కన్నా ఈ సినిమా వరుణ్ కు బాగుంటుందని సలహా ఇచ్చాడట.. బన్ని మెచ్చిన కథ కాబట్టి మరో డౌట్ లేకుండా చేశాడు వరుణ్ తేజ్. అక్కడే దెబ్బేసింది.. బన్ని చెప్పాడు కదా అనుకున్నాడు కాని బన్ని ఓ ఫ్లాప్ సినిమా తనకు అంటకట్టాడు అని గ్రహించలేదు వరుణ్ తేజ్. ఆల్రెడీ ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల బన్నితో సినిమా అంటే వద్దు అని చెప్పకుండా ఇలా వరుణ్ తేజ్ పేరు చెప్పి తప్పించుకున్నాడు. ఫైనల్ గా వరుణ్ తేజ్ ఎకౌంట్ లో మరో ఫ్లాప్ పడింది. సో అలా బన్ని చేతిలో వరుణ్ తేజ్ దారుణంగా మోసపోయాడని ఫిల్మ్ నగర్ టాక్.