షారుఖ్ కు హ్యాండ్ ఇచ్చింది..!

బాలీవుద్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునేను తీసుకునే ఆలోచన చేశారు. షారుఖ్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చెసిన దీపికా అతని సినిమా ఆఫర్ కాదంటుందా అని అనుకున్నారు. కాని ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న దీపికా షారుఖ్ ఆఫర్ ను కాదనేసిందట. 

ఓ పక్క కుర్ర హీరోలతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్న దీపికా షారుఖ్ సినిమా కాదనడంలో కారణం ఏమై ఉంటుందా అని అంటున్నారు. ట్రిపులెక్స్ రిటర్న్ సినిమా తర్వాత హాలీవుడ్ లో కూడా ప్రస్తుతం దీపికా సినిమా చర్చలు కొనసాగిస్తుంది. మరి ఈ గ్యాప్ లో షారుఖ్ తో చేసేయొచ్చు మరి ఎందుకో ఆమె షారుఖ్ తో మాత్రం చేయనని అంటుందట. అవకాశం ఇచ్చిన హీరోకే ఇలా హ్యాండ్ ఇచ్చిన దీపికా హాలీవుడ్ లో కాస్త బిజీ అయితే బీ టౌన్ దర్శక నిర్మాతలను పట్టించుకుంటుందా అని డౌట్ పడుతున్నారు.