బెల్లంకొండ బాబు లోకల్ డైరక్టర్ తో ఫిక్సయ్యాడు..!

నాని నేను లోకల్ హిట్ అందించిన డైరక్టర్ నక్కిన త్రినాధ రావు ఇప్పుడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు సినిమాల తర్వాత ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న బెల్లంకొండ హీరో తన తర్వాత సినిమా శ్రీవాస్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు.

శ్రీవాస్ తర్వాత సినిమాకు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో దర్శకుడిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నక్కిన త్రినాద రావు డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీను సినిమా ఉంటుందట. నానికి నేను లోకల్ హిట్ అందించిన ఈయన బెల్లంకొండ వారసుడికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. తనయుడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో బెల్లంకొండ సురేష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలన్ని ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.