నాని మరి అంత చీపా..!

ఒక హిట్ కొడితేనే రెండో హిట్ కోసం కిందా మీదా పడుతున్న హీరోలకు షాక్ ఇస్తూ వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలతో నాచురల్ స్టార్ నాని అందరిని అవాక్కయ్యేలా చేశాడు. రీసెంట్ గా వచ్చిన నేను లోకల్ తో కూడా అదిరిపోయే రేంజ్ లో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న నిన్ను కోరి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏషియన్ మూవీస్ కేవలం 14 కోట్లకు సొంతం చేసుకున్నారట. 

సూపర్ హిట్లు కొడుతున్న నాని సినిమా ఇంత తక్కువకు అమ్ముడవడం ఏంటి.. నాని మరి అంత చీపా అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ అయ్యాడు తన సినిమా 20 కోట్లు కచ్చితంగా షేర్ తెస్తుంది. మరి అలాంటప్పుడు 14 కోట్లకు ఎందుకు అమ్మారు అంటే. ఏషియన్ మూవీస్ తో ఉన్న కమిట్ మెంట్ తో నిర్మాత డివివి దానయ్య అలా అమ్మేశాడట. నేను లోకల్ మూవీ 27.5 కోట్ల ప్లస్ షేర్ సాధించిన నాని సినిమా ఇంత తక్కువగా బిజినెస్ అవడం అందరిని ఆశ్చర్యమే. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.