పవర్ స్టార్ ని కష్టపెడుతున్న త్రివిక్రం..!

2019 ఎన్నికల లోగా తను కమిట్ అయిన అన్ని సినిమాలు పూర్తి చేయాలని దృడ నిశ్చయంతో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు థియేటర్ లో వచ్చాడో లేదో మరో సినిమా లైన్లోకి తెచ్చాడు. త్రివిక్రం డైరక్షన్ లో పవన్ చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ దాదాపు 12 గంటల సమయం కేటాయిస్తున్నాడట.   

పవన్ ను పూర్తిగా కష్టపెడుతున్నాడట త్రివిక్రం.. అయితే ఈ కష్టం పవన్ కు ఇష్టం తోనే అని తెలుస్తుంది. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఆగష్టు 11న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కేవలం అనుకున్న రిలీజ్ డేట్ మూడు నెలలు మాత్రమే ఉండటంతో పవర్ స్టార్ కష్టపడక తప్పట్లేదు. ఎంత స్పీడ్ గా చేస్తున్నా సినిమా డైరక్టర్ త్రివిక్రం కాబట్టి ఎక్కడ నిలబెట్టాలో తెలుసు. అందుకే పవన్ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడట. పవన్ కమిట్ మెంట్ చూస్తుంటే లైన్ లో ఉన్న మిగతా రెండు సినిమాలు కూడా ఇదే స్పీడ్ తో పూర్తి చేసేట్టు కనబడుతున్నాడు.