హెబ్భా పటేల్ డేటింగ్ కహాని..!

హాట్ బ్యూటీ హెబ్భా పటేల్ ప్రస్తుతం డేటింగ్ లో ఉందట.. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు తనంతట తానే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తను ఈ పొజిషన్ లో ఉండటానికి కారణమైన అతన్నే నేను ప్రేమిస్తున్నా.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ డేరింగ్ గా చెప్పేస్తుంది హెబ్భా పటేల్. కుమారి 21ఎఫ్ తో సూపర్ క్రేజ్ సంపాదించిన హెబ్భా కొద్దిరోజులు ఆ సినిమా హీరో రాజ్ తరుణ్ తో డేటింగ్ లో ఉందని రూమర్స్ వచ్చాయి.

హెబ్భా మాత్రం తను డేటింగ్ లో ఉన్నది సినిమా పరిశ్రమకు సంబందించిన వారు కాదని షాక్ ఇచ్చింది. అమ్మడు డేటింగ్ లో ఉంది రాజ్ తరుణ్ తోనే అనుకున్న వారికి ఇది సర్ ప్రైజ్ న్యూస్ అయ్యింది. ఓ పక్క వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటున్న ఈ భామ మరో పక్క డేటింగ్ అంటూ మరో కహాని స్టార్ట్ చేసింది. ఇంత జరుగుతుంది కదా మరి పెళ్లెప్పుడు అని అడిగితే అది మాత్రం ఇప్పుడప్పుడే లేదు అని చెప్పేస్తుంది.