
ఈమధ్య హీరోయిన్స్ అంతా మూకుమ్మడిగా తమ మీద అసభ్యకరంగా ప్రవర్తించిన వారి మీద పనికట్టుకుని మరి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పడక గదిలోకి వస్తేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి.. ఇస్తున్నారు అన్న దాని మీద ఒక్కో హీరోయిన్ ఒక్కో రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్స్ పై జరుగుతున్న అన్యాయాలకు తన సపోర్ట్ అందించింది మలయాళ నటి పార్వతి.
మలయాళంలో ఆల్రెడీ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన పార్వతి. తమిళంలో ధనుష్ తో మారియన్ ఇంకా బెంగుళూరు డేస్ రీమేక్ లో నటించింది. ఇక తనకు జరిగిన అవమానాలను ఓ ఇంటర్వ్యూలొ గుర్తుచేసుకున్న పార్వతి. మలయాళంలో కొందరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని. అవకాశం రావాలంటే బెడ్రూం కు రావాలని తనని అడిగారని.. ఇవన్ని ఇక్కడ కామన్ అని వారు సలహా కూడా ఇచ్చారని అంటుంది పార్వతి. వారు అడిగినట్టు చేస్తే ఏం లేదు కాని తాను అలా చేయనందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని అంటుంది పార్వతి.