అనిరుధ్ పెళ్లి మ్యాటర్..పెద్ద జోకండి బాబు..!

మ్యూజిక్ మిరకిల్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియా తెగ హడావిడి చేసింది. ఓ జెవెలరీ షాప్ ఓనర్ కూతురుతో అనిరుధ్ తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. అయితే ఈ న్యూస్ పై అనిరుధ్ క్లారిటీ ఇచ్చేశాడు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్ని రూమర్లే అంటూ కొట్టి పడేశాడు. ఇక ఇక్కడ అసలు జోక్ ఏంటి అంటే మీడియా ఎవరైతే జెవెలరీ షాప్ ఓనర్ కూతురు అని హడావిడి చేస్తుందో అసలు అతనికి కూతురే లేదట.

సో మొత్తానికి గాలి వార్త పట్టుకుని మీడియా వారం రోజులుగా తెగ సందడి చేసినదన్నమాట. ఈమధ్య సుచి లీక్స్ లో అనిరుధ్ ప్రైవేట్ పిక్స్ రిలీజ్ అవగా వాటిని డైవర్ట్ చేసేందుకే పెళ్లి మ్యాటర్ తెచ్చి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా యువ సంగీత దర్శకుడిగా ఎంత క్రేజ్ సంపాదించాడో అదే రేంజ్ వార్తల్లో నిలుస్తున్నాడు అనిరుధ్. ఇక ప్రస్తుతం తెలుగులో పవన్ త్రివిక్రం మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించడానికి సైన్ చేశాడు.