నేనా హాట్ సీన్స్.. నో వే..!

హాట్ యాంకర్ గా బుల్లితెర మీద హల్ చల్ చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉంది. తన అల్లరితో ఆడియెన్స్ అందరిని ఆకట్టుకుంటున్న అమ్మడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న అమ్మడు బాలీవుడ్ రీమేక్ గా వస్తున్న హంటర్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో బాబు బాగా బిజీగా వస్తున్న సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.

సినిమాలో తేజశ్వి, మిస్తి చక్రవర్తితో పాటుగా శ్రీముఖి కూడా నటిస్తుండటం విశేషం. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీముఖితో హాట్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. బుల్లితెర మీదే అడల్ట్ కామెడీతో హల్ చల్ చేసే అమ్మడు కచ్చితంగా బాబు బాగా బిజీలో రెచ్చిపోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయం పట్ల శ్రీముఖి నవ్వుతూ రెస్పాండ్ అవుతుంది. సినిమాలో ఊహించినట్టు ఎలాంటి సీన్స్ ఉండవని అలా అనుకుంటే కచ్చితంగా పొరపాటు పడినట్టే అని అంటుంది. మరి బుల్లితెర మీద తన యాంకరింగ్ తో రెచ్చగొడుతున్న శ్రీముఖి బాబు బాగా బిజీలో నిజంగానే హోంలీ పాత్ర చేస్తుందా లేక పబ్లిసిటీ కోసం అలా చెబుతుందా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.