
బాలీవుడ్ అవకాశం వస్తే చాలు సౌత్ లో చూపించని అందాలన్ని అక్కడ అంగట్లో పెట్టేస్తారు.. అక్కడ ఒక్కసారి హాట్ ఇమేజ్ సంపాదిస్తే చాలు బీ టౌన్ ఆడియెన్స్ అందలం ఎక్కించేస్తారు. అందుకోసమే సౌత్ లో కట్టు బొట్టుతో చక్కనైనా రూపంతో కనిపించిన భామలు బాలీవుడ్ కు వెళ్లగానే అక్కడ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు హాట్ ఐటంగా మారుతుంటారు. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది రాయ్ లక్ష్మి.
మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150లో రత్తాలు సాంగ్ తో రచ్చ చేసిన అమ్మడు స్టార్ హీరోల దృష్టిలో పడింది. అంతేకాదు ఖైదితో వచ్చిన ఇమేజ్ తో తను నటిస్తున్న జూలీ-2 సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దీపక్ శివదాసాని డైరెక్ట్ చేస్తున్న జూలీ సీక్వల్ లో రాయ్ లక్ష్మి రెచ్చిపోతుందని టాక్. స్కిన్ షో.. ఇంటిమేట్ సీన్స్ కు ఏమాత్ర అడ్డు చెప్పడం లేదట. బాలీవుడ్ ను తన అందంతో హీటు పుట్టించే ప్రయత్నం చేస్తున్న అమ్మడు ఈ దెబ్బతో అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.
డైరక్టర్ చెప్పిన దానికన్నా మరింత హాట్ గా కనిపిస్తుందట రాయ్ లక్ష్మి. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా చేసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత ఐటం సాంగ్స్ కూడా చేసుకుంటూ వచ్చింది. ఇక మరో పక్క బాలీవుడ్ లో చేస్తున్న జూలీ సీక్వల్ తో తన సత్తా చాటాలని చూస్తుంది. అమ్మడు చేసే ఈ రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలంటే సినిమా చూస్తేనే గాని చెప్పలేం.