
టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ ఒకటి షురూ అవుతుంది.. వర్మ శిష్యుడిగా హీరోగా తెరంగేట్రం చేసి దర్శకుడిగా కూడా మారిన జెడి చక్రవర్తి హీరోగా అమ్మ రాజశేఖర్ డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒకప్పటి యూత్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న జెడి చక్రవర్తి అలియాస్ గెడ్డం చక్రవర్తి ఇప్పటికి మంచి హ్యాండ్సంగా ఉన్నాడు.
ఇక డ్యాన్స్ మాస్టర్ గా కెరియర్ ప్రారంభించి తర్వాత డైరక్టర్ గా మారిన అమ్మ రాజశేఖర్ గోపిచంద్ లాంటి సూపర్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావడం విశేషం. రేర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో మళ్లీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు జెడి చక్రవర్తి. యువ హీరోల పోటీలో జెడి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.