
కుర్ర హీరోయిన్స్ లో హెబ్భా పటేల్ అంటే విపరీతమైన క్రేజ్.. కుమారి 21f తో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమా హిట్ అవడానికి ముఖ్య పాత్ర పోశించింది హెబ్భా పటేల్ అని చెప్పొచ్చు. అదే హిట్ మేనియా కంటిన్యూ చేస్తూ హెబ్బా అందంతో పాటు అభినయంతో కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. లాస్ట్ ఇయర్ ఈడోరకం ఆడోరకంతో హిట్ అందుకున్న అమ్మడు నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడాతో కూడా హిట్ కొట్టింది.
ఇక ఈ ఇయర్ లో నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ తో కూడా సూపర్ హిట్ అందుకున్న హెబ్బా పటేల్ లేటెస్ట్ గా మిస్టర్, ఏంజెల్ సినిమాలతో రాబోతుంది. రీసెంట్ గా జరిగిన జీ అవార్డ్ ఫంక్షన్ లో అందాలతో అదరగొట్టేసింది హెబ్భా పటేల్. ఇన్నాళ్లు ఆఫ్ స్క్రీన్ హాట్ ఇమేజ్ తో హల్ చల్ చేసిన అమ్మడు ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో కూడా రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. మతిపోగొట్టే అందాలతో హెబ్బా చేస్తున్న ఈ అందాల ప్రదర్శన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కుర్ర హీరోలతో వరుస విజయాలను అందుకుంటున్న హెబ్బా త్వరలోనే స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను అందుకోవాలని ఆశిద్దాం.